Jail Authorities: లిక్కర్ కేసు నిందితులకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:32 AM
లిక్కర్ కేసులో నిందితులు సజ్జల శ్రీధర్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డిలను జైలు అధికారులు మంగళవారం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
ప్రభుత్వ ఆస్పత్రికి శ్రీధర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
విజయవాడ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): లిక్కర్ కేసులో నిందితులు సజ్జల శ్రీధర్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డిలను జైలు అధికారులు మంగళవారం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వారికి వేర్వేరు విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పంటి నొప్పితో బాధపడుతున్న శ్రీధర్‌రెడ్డికి దంత వైద్య కళాశాలలో పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న కృష్ణమోహనరెడ్డికి జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు అనంతరం వీరిద్దరిని అధికారులు తిరిగి జైలుకు తీసుకెళ్లారు.