సాధారణ వ్యక్తిలా..!
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:53 AM
శ్రీశైలం పర్యటనకు వచ్చిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి హోదాతో సంబంధం లేకుండా సాధారణ వ్యక్తిలా భక్తులతో మమేకమయ్యారు.
నంద్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం పర్యటనకు వచ్చిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి హోదాతో సంబంధం లేకుండా సాధారణ వ్యక్తిలా భక్తులతో మమేకమయ్యారు. శ్రీశైలానికి వచ్చిన భక్తులతో ఆయన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తెలుసుకున్నారు. సెక్యూరిటీ, వ్యక్తిగత సహాయకులను దూరంగా ఉంచి కాసేపు స్థానికులు, మల్లన్న భక్తులతో ముచ్చటించారు. ప్రభుత్వంలో సరిదిద్దుకోవాల్సిన లోపాలు ఉంటే చెప్పాలంటూ ప్రజలను అడిగారు. ఈ సందర్భంగా ఓ టీస్టాల్ వద్దకు వెళ్లి టీతాగారు.