Visakhapatnam: పిడుగు పడితే హడల్..
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:31 AM
వానాకాలంలో పిడుగులు పడడం సహ జం..! కానీ.. వాతావరణంలో మార్పుల ప్రభావంతో ఇటీవల పిడుగుల తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల నుంచి విశాఖ నగర పరిసరాల్లో మేఘాలు...
వాతావరణ మార్పులతో పెరుగుతున్న తీవ్రత
మొన్న ఆయిల్ ట్యాంకుపై.. నిన్న యుద్ధనౌక సమీపంలో
విశాఖ నగర పరిసరాల్లో పెరిగిన పిడుగులు
ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో పిడుగుపాటుతో 1,621 మంది మృతి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వానాకాలంలో పిడుగులు పడడం సహ జం..! కానీ.. వాతావరణంలో మార్పుల ప్రభావంతో ఇటీవల పిడుగుల తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజుల నుంచి విశాఖ నగర పరిసరాల్లో మేఘాలు ఏర్పడిన వెంటనే చెవులు చిల్లులు పడేలా పిడుగుల శబ్ధం వినిపిస్తోంది. ఆదివారం పోర్టు ఏరియాలో ఈస్టిండియా కంపెనీ ఆయిల్ ట్యాం కుపై పిడుగు పడిన ఘటన కలకలం రేపిం ది. సోమవారం కూడా బంగాళాఖాతంలో యుద్ధనౌక సమీపంలో పిడుగు పడినట్టు వెదర్‌మ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. యుద్ధనౌకకు అతి సమీపం లో కళ్లుమిరుమిట్లు గొలిపేలా మెరుపు మెరిి స, ఆవెంటనే పిడుగు పడినట్టు పేర్కొన్నారు.
ఆయిల్ ట్యాంకుపై..
నైరుతి రుతుపవనాల సీజన్‌లో పిడుగు లు సర్వసాధారణం. తుఫాన్‌ల సీజన్(అక్టోబరు, నవంబరు)లో కూడా పిడుగులు పడుతుంటాయి. మెరుపులను(లైట్నింగ్) ఆప్టికల్ గా, పిడుగు(థండర్)లను ఎలక్ర్టికల్‌గా పిలుస్తారు. భూమికి 750 మీటర్ల ఎత్తు నుంచి థండర్స్, లైట్నింగ్స్ సంభవిస్తుంటాయి. ఇవి మేఘాల నుంచి నేరుగా భూమిని తాకుతుంటాయి. ఆదివారం ఈస్టిండియా కంపెనీ ఆ యిల్ ట్యాంకుపై పడిన పిడుగు అత్యంత శఽక్తివంతమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది 2 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపైకి దూసుకురావడంతో ట్యాం కు పైకప్పు ఊడిపోయిందన్నారు.
పిడుగుపాటు మరణాలూ అధికమే..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దేశంలో పిడుగుల ధాటికి 1,621 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మధ్య, తూర్పు భారతంలో 126 మంది(బిహార్‌లో 82 మంది, ఉత్తరప్రదేశ్‌లో 23 మంది) చనిపోయారు. పిడుగులు, మెరుపుల ధాటికి ఒడిశాలో ఎక్కువ మంది చనిపోతున్నారు. గత ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో 1,625 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్క డ ఏటా ఆరు లక్షల మెరుపులు/ఉరుములు/పిడుగులు సంభవిస్తున్నాయి. బిహార్‌లో ఏటా సగటున 271 మంది చనిపోతుండగా.. 2020 జూన్ 25వ తేదీ ఒక్కరోజే 83 మంది పిడుగుల ధాటికి మృతిచెందారు.
పిడుగు పడితే లక్షల వోల్టుల విద్యుత్
క్యుములోనింబస్ మేఘాల విచ్ఛిన్న సమయంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు సంభవిస్తాయి. ఆ సమయంలో తీవ్రమైన విద్యుత్ ప్రవహించి, గాలి సంకోచ వ్యా కోచకాలకు లోనై శబ్ధం పుడుతుంది. దానినే పిడుగు అంటాం. ముందు మెరుపు సంభవించిన తరువాత శబ్ధం వస్తుంది. కొన్ని లక్ష ల వోల్టుల విద్యుత్ శక్తితో కూడిన పిడుగు భూమిని తాకినప్పుడు చెట్లు, భవనాలు ధ్వంసమవుతాయి. అదే మనుషులకు తాకితే మృత్యువాత పడతారు. పిడుగులు, ఉరుము లు, మెరుపులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆయా రాష్ట్రాల్లో ముందస్తు సమాచారం అందిస్తోంది. ఆయా ప్రాంతాల్లో సెల్‌ఫోన్లకు విపత్తుల నిర్వహణ సంస్థ మెసేజ్‌లు పంపిస్తోంది. అయినా ప్రజల్లో అవగాహన కొరవడి పట్టించుకోవడం లేదు.