Meteorological update: నేడు అక్కడక్కడా వర్షాలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:11 AM
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం అక్కడ భూ ఉపరితలంపై అల్పపీడ నం ఏర్పడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఆదివారం అక్కడ భూ ఉపరితలంపై అల్పపీడ నం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం దూరంగా ఉన్నందున రాష్ట్రంపై పెద్దగా ప్రభావం ఉండదని వాతావరణ నిపుణులు చెప్పారు. కాగా శనివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. మిగిలినచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. నెల్లూరులో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.