Share News

Organ Donation: అవయవదానంతో పునర్జన్మ

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:10 AM

విజయనగరంలోని తిరుమల మెడికవర్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసేందుకు...

Organ Donation: అవయవదానంతో పునర్జన్మ

  • బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం

  • గ్రీన్‌చానల్‌ ద్వారా అవయవాల తరలింపు

విజయనగరం రింగురోడ్డు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని తిరుమల మెడికవర్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు శుక్రవారం గ్రీన్‌ చానల్‌ను ఏర్పాటు చేసి అంబులెన్స్‌ల ద్వారా అవయవాలను తరలించారు. ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ కె.తిరుమల ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కేఎల్‌ పురం ఎస్సీ, ఎస్టీ కాలనీకి చెందిన సిగడం ఆదినారాయణ (56) ఈ నెల 20న తీవ్రమైన హెమరేజ్‌ స్ట్రోక్‌ గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు. అవయవదానంపై ఆదినారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో వారు అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు శుక్రవారం ఉదయం గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి ఆదినారాయణ కిడ్నీలు, కార్నియాలను అంబులెన్స్‌ల ద్వారా విశాఖకు తరలించారు. ఆదినారాయణ కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ తిరుమల ప్రసాద్‌, వైద్యులు ధ్రువపత్రం అందజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికార లాంఛనాలతో శనివారం ఆదినారాయణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - Nov 22 , 2025 | 05:10 AM