నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సు రద్దు
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:51 PM
ఎరువుల దుకాణాల యజమానులు నిబంధనలు అతిక్ర మిస్తే లైసెన్స రద్దు చేస్తామని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ హెచ్చరించారు.
జమ్మలమడుగు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఎరువుల దుకాణాల యజమానులు నిబంధనలు అతిక్ర మిస్తే లైసెన్స రద్దు చేస్తామని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ హెచ్చరించారు. జమ్మలమడుగు పట్టణంలో శనివారం ఆర్డీవో సాయిశ్రీ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముద్దనూరు రోడ్డులోని శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్స్ దుకాణాన్ని ఆర్డీవో తనిఖీ చేసి ఎరువుల దుకాణం యజమానితో మాట్లాడారు. రైతులకు ఎరువుల కొరత లేకపోయినా దుకాణాలవారు కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే వారి వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువులు పాత స్టాక్ ఇచ్చి రైతులకు ఇబ్బంది కలిగించరాదన్నారు. ఎరువుల దుకాణాల వారు బల్క్‌గా యూరియా, ఇతర మందులు పక్కనపెట్టుకుని రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పవన్నారు. ఇక నుంచి ప్రతిరోజు తనిఖీలు తప్పవన్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఎరువుల యజమానులు పాల్గొన్నారు.