లెవెంత్ రెడ్డికి బుర్ర పోయింది!: సంధ్యారాణి
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:35 AM
వైసీపీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే లెవెంత్ రెడ్డికి బుర్రపోయినట్టుందని మంత్రి గుమ్మిడి సంధ్యారా ణి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఆ నాయకుడిని ఛీకొట్టి 11 స్థానాలకే...
సాలూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, పులివెందుల ఎమ్మెల్యే లెవెంత్ రెడ్డికి బుర్రపోయినట్టుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఆ నాయకుడిని ఛీకొట్టి 11 స్థానాలకే పరిమితం చేసినా ఏమాత్రం మార్పు రాలేదన్నారు. మన్యం జిల్లా సాలూరులో సోమవారం ఆమె మాట్లాడారు. వైసీపీ శాసనసభ్యులకు ప్రజా సమస్యలు పట్టడంలేదని, ఆ నాయకుడి భజనే వారికి ముఖ్యమైపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, వాళ్ల నాయకుడు చెప్పినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరూ ఇవ్వరని, ప్రజలే ఇవ్వాలని, ఆ మాత్రం జ్ఞానం లేకుండా పదేపదే హోదా కావాలని కోరడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు.