Share News

వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:35 PM

వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి పరిస్థితుల్లో అమెరికా, బ్రిటన్లతో ఒప్పందం చేసుకోకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ పిలుపునిచ్చారు.

   వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం
కలెక్టరేట్‌ ఎదుట జరిగిన సభలో మాట్లాడుతున్న రైతు, ప్రజా సంఘాల నాయకులు

రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి పరిస్థితుల్లో అమెరికా, బ్రిటన్లతో ఒప్పందం చేసుకోకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ పిలుపునిచ్చారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు నగరంలోనిసుందరయ్య కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనతరం రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చాక రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బ్రిటన ప్రభుత్వాలతో చేసుకునే ఒప్పందం వల్ల మన వ్యవసాయం రంగం తీవ్రమైన సంక్షోభంలో పోవడానికి అవకాశం ఉందన్నారు. తక్షణమే కార్పొరేట్‌ అనుకూలమైన విధానాలకు స్వస్తి పలకాలని, లేని పక్షంలో రాబోయే కాలాంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఆనంద్‌బాబు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.రాముడు, రాజశేఖర్‌, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:35 PM