చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:17 AM
చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దామని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు.
నంద్యాల కల్చరల్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దామని డీఈవో జనార్దనరెడ్డి అన్నారు. ఇంటాక్ సంస్థ నంద్యాల చాప్టర్ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి అధ్యక్షన నంద్యాల గురురాజ స్కూల్ ఆవరణలో రెండు రోజుల శిక్షణ సదస్సును సోమవారం డీఈవో ప్రారంభించారు. కళలు, సంస్కృతి, చారిత్రక కట్టడాల పరిరక్షణ తదితర అంశాలపై ఢిల్లీ నుంచి వచ్చిన అభిషేక్, దీపాన్స ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అహోబిలం సాంస్కృతిక వైభవం, పారువేట విశేషా లు తెలిపే పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో ఇంటాక్ నంద్యాల చాప్టర్ అడిషనల్ కోకన్వీనర్ సేతురామన, గురురాజా స్కూల్ డైరెక్టర్ షేక్షావలిరెడ్డి, రోటరీస్కూల్ కరస్పాండెంట్ డీవీ సుబ్బయ్య, ప్రైవేట్ పాఠశాలల సాంఘిక శాస్త్ర ఉపాధాయులు పాల్గొన్నారు.