Share News

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:50 PM

నగరంలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన వనటౌనలోని పేట శ్రీరామాలయంలో నిర్వహించనున్న శతాబ్ది బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు నగర భక్తులంతా ముందుకు రావాలని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి పిలుపునిచ్చారు.

 బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
మాట్లాడుతున్న వీహెచపీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి

వీహెచపీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి

కర్నూలు కల్చరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నగరంలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన వనటౌనలోని పేట శ్రీరామాలయంలో నిర్వహించనున్న శతాబ్ది బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు నగర భక్తులంతా ముందుకు రావాలని విశ్వ హిందూ పరిషత (వీహెచపీ) రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని షరా్‌ఫబజార్‌లోని వేంకటాచలపతి కల్యాణ మంటపంలో ఆయన మాట్లాడుతూ ఈ రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించి 99 ఏళ్లు అయ్యాయని, ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తయి, శతాబ్ది బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు మాళిగి హనుమేషాచార్యులు మాట్లాడుతూ ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకు ఆలయంలో శతాబ్ది బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏప్రిల్‌ 16న ఉదయం 10 గంటలకు సీతారామ కల్యాణోత్సవం, సాయంత్రం 5 గంటలకు దివ్య మంగళ రథోత్సవం ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో లలితీ పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి, వీహెచపీ నాయకులు ఎస్‌ ప్రాణేశ, నీలి నరసింహ, భానుప్రకాశ, డాక్టర్‌ సీఏ నగేశ లతోపాటూ వివిధ కులసంఘాలు, ఆలయాలు, ఆథ్యాత్మిక కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:50 PM