బాల కార్మిక వ్యవస్థను రూపు మాపుదాం
ABN , Publish Date - May 07 , 2025 | 11:19 PM
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది కోరారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది
న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
కర్నూలు లీగల్, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది కోరారు. బుధవారం జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని.. బాలలు పని ప్రదేశాల్లో గాక పాఠశాలలో విద్యనభ్యసించాలని ఆయన కోరారు. శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ అధికారులు, కార్మిక శాఖ అధికారులతో కూడిన బృందాలు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ర్యాలీ స్థానిక పాతబస్టాండు, రాజ్‌విహార్ సెంటర్, పెద్దమార్కెట్, ఆనంద్ థియేటర్, భూపాల్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో ఉన్న షాపులను, హోటళ్లను తనిఖీచేశారు. ఈ తని ఖీలలో ఐదు మంది బాలకార్మికులను గుర్తించారు. బాల కార్మికుల తల్లి దండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తర్వాత బాలకార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే లీగల్ సర్వీసెస్ టోల్‌ఫ్రీ నెంబరు: 15100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన సెంటర్ నెంబర్: 1098లకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.లీలా వెంకట శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబ శివరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల, చైల్డ్ ప్రొటెక్షన ఆఫీసర్ శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన జుబేదా బేగం పాల్గొన్నారు.