Share News

పండుగలను ఐకమత్యంగా జరుపుకొందాం

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:46 PM

హిందువులందరూ అంద రూ ఐకమత్యంగా పం డుగలు జరుపుకోవాలని అచలానంద ఆశ్రమ పీఠా ధిపతి విరజానందస్వామి పిలుపునిచ్చారు.

పండుగలను ఐకమత్యంగా జరుపుకొందాం
మాట్లాడుతున్న విరజానందస్వామి

అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానందస్వామి

మైదుకూరు రూరల్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) హిందువులందరూ అంద రూ ఐకమత్యంగా పం డుగలు జరుపుకోవాలని అచలానంద ఆశ్రమ పీఠా ధిపతి విరజానందస్వామి పిలుపునిచ్చారు. స్థానిక కశెట్టి కళ్యాణ మండపం లో ఆదివారం గణపతి మహోత్సవ కమిటీ ఆద్వర్యంలో మైదుకూరు పరిధి లోని హిందువులందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశలో మొదట చిన్నారుల భరతనాట్యం, కోలాటం, డప్పు వాయిద్యం తదితర సాంస్కృతి క కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా పాల్గొన్న విరజా నందస్వామి మాట్లాడుతూ ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి పండుగను హిందువులందరూ ఐకమత్యంగా జరుపుకోవాలని, అంతేకాకుండా వినాయ కుడి నిమర్జనం కూడా అందరూ ఒకే రోజున చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైదుకూరు ఇన్‌చార్జి మాచనూరు సుబ్బరాయు డు, వీరభద్ర దేవస్థానం చైర్మన్‌ పెరుగు వీరనారాయణ, కామనూరు శ్రీనివాసులు, పెద్దయ్య, హరనాధ్‌, కుమార్‌, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:46 PM