Forest Department: తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:05 AM
తిరుమల నడక మార్గంలోని ఏడవ మైలు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున చిరుత సంచరించింది.
మంగళం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల నడక మార్గంలోని ఏడవ మైలు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున చిరుత సంచరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చిరుత సంచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఏడవ మైలు వద్ద ఒక సెక్షన్ ఆఫీసర్‌తోపాటు బీట్ ఆఫీసర్ 15 మంది వాచర్లు, వెటర్నరీ డాక్టర్‌ను నియమించారు.