Share News

Tirupati: అలిపిరి సమీపంలో చిరుత సంచారం

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:13 AM

తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక చిరుత చక్కర్లు కొట్టింది.

Tirupati: అలిపిరి సమీపంలో చిరుత సంచారం

తిరుమల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక చిరుత చక్కర్లు కొట్టింది. తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో అలిపిరి టోల్‌గేట్‌కి వంద మీటర్ల దూరంలో 3 గంటల సమయంలో చిరుత రోడ్డుపైకి వచ్చింది. తిరుమలకు వెళుతున్న వాహనదారులు చిరుతను రోడ్డుపై చూసి షాకయ్యారు. ఈ సమాచారంతో టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది.

Updated Date - Oct 18 , 2025 | 04:15 AM