Train Collision: రైలు ఢీకొని చిరుత మృతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:36 AM
రైలు ఢీకొని చిరుతపులి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది
ఆదోని, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొని చిరుతపులి మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు రైల్వేస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ అధికారిణి తేజస్వి తెలిపిన మేరకు... కుప్పగల్లు రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఓ చిరుత పట్టాలను దాటే క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఆ ధాటికి చిరుతపులి శరీరం రెండు ముక్కలై అక్కడికక్కడే మృతిచెందింది. పట్టాలపై చిరుతను గమనించిన రైల్వే పోలీ్‌సస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరాం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అక్కడే దహనక్రియలు నిర్వహించారు. అయితే ఏ రైలు ఢీకొట్టిందనే వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.