Share News

Ritual Ceremony: ఎంపీ సీఎం రమేశ్‌కు నేతల పరామర్శ

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:43 AM

రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ తల్లి రత్నమ్మ దశ దినకర్మ వైఎస్సార్‌ కడప జిల్లా పోట్లదుర్తిలో సోమవారం నిర్వహించారు.

Ritual Ceremony: ఎంపీ సీఎం రమేశ్‌కు నేతల పరామర్శ

ఎర్రగుంట్ల, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ తల్లి రత్నమ్మ దశ దినకర్మ వైఎస్సార్‌ కడప జిల్లా పోట్లదుర్తిలో సోమవారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చి సీఎం రమేశ్‌ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోం మంత్రి అనిత, అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, అనగాని ప్రసాద్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు రత్నమ్మ చిత్రపటానికి పూలవేసి నివాళులర్పించారు. రత్నమ్మ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. సీఎం రమేశ్‌ తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలు, మరణించినంత వరకు ఉన్న జ్ఞాపకాలతో కూడిన ఫొటో ప్రదర్శనను వచ్చిన వారు ఆసక్తిగా తిలకించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ప్రదర్శనను తిలకిస్తూ రమేశ్‌ తండ్రి సీఎం మునిస్వామినాయుడును పలకరిస్తూ పాత జ్ఞాపకాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 04:45 AM