Share News

Chief Minister Chandrababu Naidu: ఆ పదవికి గౌరవాన్ని తెస్తారు

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:47 AM

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు....

Chief Minister Chandrababu Naidu: ఆ పదవికి గౌరవాన్ని తెస్తారు

  • ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు

  • ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘జాతికి సేవ చేసేందుకు వచ్చిన అవకాశంలో మీరు విజయం సాధిస్తారని నమ్ముతున్నా. ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో మీకు ఉన్న అపారమైన అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ... ‘ఆయన అనుభవం, ఆదర్శవంతమైన రాజనీతిజ్ఞత ఉపరాష్ట్రపతి పదవికి గౌరవాన్ని తెస్తాయి. రాజ్యసభలో నిర్మాణాత్మక చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మ రింత బలోపేతం చేయడానికి ఆయన కృషి చేస్తారు’ అని ఆకాంక్షించారు. కాగా మంత్రి లోకేశ్‌, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సత్యకుమార్‌ ఓ ప్రకటనలో... అభ్యుదయ భావాలు కలిగిన రాధాకృష్ణన్‌ సేవలు ఇకపై దేశానికి ఉపయోగపడనున్నాయని అన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 05:47 AM