మద్యం కుంభకోణంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది: జనార్దనరెడ్డి
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:51 AM
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి బీసీ జనార్దనరెడ్డి చెప్పారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘జగన్ తీరు చూస్తుంటే, దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది. కక్షపూరిత రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్. రాష్ట్రంలో ఇసుక, మద్యం కుంభకోణం జరిగిందని పిల్లోడిని అడిగినా చెబుతారు. అసలైన నిందితులు ఎవరనేది, దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. నిందితులకు శిక్ష తప్పదు! ఈ డబ్బు ఎక్కడికెళ్లింది, త్వరలో బయటకు వస్తుంది. కక్ష సాధింపులు లేవు కాబట్టే, మాకు ప్రజలు అధికారం ఇచ్చారు’ అని మంత్రి జానర్దనరెడ్డి చెప్పారు.