Share News

Lanka Dinakar: విమానముంటేనే ఏపీకి వస్తారా..

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:14 AM

జగన్‌ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనడం అటుంచితే... బెంగళూరు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక ఏపీకి వస్తానని చెప్పడం చూస్తే చాలు...

Lanka Dinakar: విమానముంటేనే ఏపీకి వస్తారా..

  • ప్రజలపై జగన్‌ నిబద్ధతను అర్థం చేసుకోవడానికి ఇది చాలు

  • తుఫాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది: లంకా దినకర్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనడం అటుంచితే... బెంగళూరు నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక ఏపీకి వస్తానని చెప్పడం చూస్తే చాలు... ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ఎంతో అర్థమవుతుంది’ అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు. బుధవారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో హుద్‌హుద్‌ వచ్చినప్పుడు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు విమాన సర్వీసు కోసం ఎదురుచూడకుండా బస్సులో ప్రజల వద్దకు వెళ్లి సేవ చేశారని గుర్తు చేశారు. మొంథా తుఫాను వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి, బాధితులను ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్‌ నుంచి సీఎం చంద్రబాబు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యల అమలు సాధ్యమయిందని దినకర్‌ వివరించారు.

Updated Date - Oct 30 , 2025 | 05:14 AM