Share News

వై మీడియాకు అక్రమంగా రూ.96 కోట్లు : లంకా

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:00 AM

ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా వై మీడియా అనే సంస్థకు రూ.96 కోట్లు అక్రమంగా చెల్లించిందని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ చేస్తున్నామని...

వై మీడియాకు అక్రమంగా రూ.96 కోట్లు : లంకా

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా వై మీడియా అనే సంస్థకు రూ.96 కోట్లు అక్రమంగా చెల్లించిందని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల అమలు తీరుపైన 26 జిల్లాల అధికారులతో సమీక్షలు పూర్తి చేశామన్నారు. గత ఐదేళ్లలో కేంద్రం 2.61 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వగా 1.40 లక్షలే లబ్ధిదారులకు ఇచ్చారని, అందులో నివసిస్తున్నది 87 వేల మందేనని పేర్కొన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడి, నాణ్యత లేకుండా పనులు చేసి దోచుకున్నారన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 97 లక్షల గృహాలకు తాగునీరు అందిస్తామన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 05:01 AM