భూసమస్యలు పరిష్కరించి.. పేదలకు పంపిణీ
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:48 PM
బ్రహ్మంగారిమఠం మండలం లో భూసమస్యలు పరిష్కరించి మిగిలి న భూములను నిరుపేదలకు పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యా దవ్ తెలిపారు.
ప్రజలు సహకరించండి అభివృద్ధి చేసి చూపిస్తా : ఎమ్మెల్యే పుట్టా
బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 28 (ఆంధ్ర జ్యోతి) : బ్రహ్మంగారిమఠం మండలం లో భూసమస్యలు పరిష్కరించి మిగిలి న భూములను నిరుపేదలకు పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యా దవ్ తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పాత్రికే యులతో ఎమ్మెల్యే పుట్టా మాట్లాడుతూ ప్రజల సహాయ సహకారాలు అవసర మని, రాబోవు రోజుల్లో భూ ఆక్రమణ చేసిన వారి వద్ద నుంచి భూములు స్వీకరించి భూములు లేని నిరుపేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే భూసర్వే కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని వారు వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలించి ఎవరైతే అక్రమంగా భూములు ఆనలైనలో చేయించుకున్నారో వారి పేర్లను తొలగించి నివే దికను కలెక్టర్‌కు అందించడం జరుగుతుందన్నారు. అంతకు ముందు మండలంలోని పలుగురాళ్లపల్లె పొలం మల్లేపల్లె ప్రాంతంలో నూతనంగా నవోదయ పాఠశాలను నిర్మాణం చేపట్టేందుకు బద్వేలు ఆర్డీవో చంద్రమోహన, తహసీల్దారు దామోదర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పుట్టా స్థలాన్ని పరిశీలించారు. తోట్లపల్లె గ్రామంలో దాదాపు రూ.25 కోట్లు పెట్టి నిర్మించిన మహా గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి దేవస్థానంలో ఇటీవల అభివృద్ధి పనులను ఫిట్‌పర్సన శంకరబాలాజీ ఆహ్వానం మేరకు ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు జాన్సన. ఎంపీడీవో కిశోర్, టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ముడుమాల పోలిరెడ్డి, ఎల్లటూరు సాంబశివారెడ్డి, ఎస్‌ఆర్ శ్రీనివాసులరెడ్డి, సర్పంచ నారాయణ, యత్తపు ఈశ్వర్‌రెడ్డి, నాగయ్య, సుధాకర్, ముదు ్దక్రిష్ణమనాయుడు, జాండ్లవరం సుబ్బనాయుడు, జయరాంనాయుడు, పూజా శివతో పాటు టీడీపీ నేతలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.