సీఎంను కలిసిన లక్ష్మాపురం సర్పంచ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:28 PM
మండలంలోని లక్ష్మాపురం సర్పంచ సుజాత మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.
పగిడ్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మాపురం సర్పంచ సుజాత మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సీఎంకు వినతి పత్రాన్ని ఇచ్చారు. నందికొట్కూరు నుంచి పగిడ్యాలకు వెళ్లే రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. బేడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, లక్ష్మాపురం గ్రామంలో నీటి కొరత ఉందని, నూతన ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. త్వరలోనే తమ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. సీఎంను కలిసేందుకు చొరవ తీసుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు తెలియజేశారు.