Share News

Nellore Police: లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:28 AM

నెల్లూరుజిల్లాకు చెందిన లేడీడాన్‌ అరుణపై పోలీసు అధికారులు పీడీ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) యాక్ట్‌ నమోదు చేశారు.

Nellore Police: లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌

  • నెల్లూరు నుంచి కడప సెంట్రల్‌ జైలుకు

  • గత ప్రభుత్వంలో అనేక నేరాలు

  • రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ‘పెరోల్‌’పై రచ్చ

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో వెలుగులోకి

  • బాధితుల నుంచి వరుసగా ఫిర్యాదులు

  • వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు

  • ఇదివరకే రౌడీషీట్‌ ఓపెన్‌

నెల్లూరు (క్రైం), డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): నెల్లూరుజిల్లాకు చెందిన లేడీడాన్‌ అరుణపై పోలీసు అధికారులు పీడీ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) యాక్ట్‌ నమోదు చేశారు. కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామం కేఆర్‌ఆర్‌ నగర్‌కు చెందిన అరుణ గత ప్రభుత్వంలో అనేక నేరాలకు పాల్పడింది. రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌ విషయంపై పలుమార్లు ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలతో అరుణ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. అరుణ చేసిన నేరాలపై కోవూరు, నవాబుపేట, వేదాయపాలెం పోలీసు స్టేషన్లతో పాటు విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసు నమోదైంది. కోవూరు పోలీసులు అరుణపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. ఇంత నేరచరిత్ర కలిగిన అరుణపై పీడీ యాక్ట్‌ ప్రయోగించేందుకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు ఎస్పీ అజిత వేజెండ్ల ప్రతిపాదనలు పంపారు. కలెక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కోవూరు పోలీసులు అరుణపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా నెల్లూరులోని ఇద్దరు రౌడీషీటర్లు ఎస్‌ జయప్రకాశ్‌, షేక్‌ షాహుల్‌ హమీద్‌లపైనా పోలీసులు పీడీయాక్ట్‌ నమోదు చేశారు. వీరిద్దరిని నెల్లూరు నుంచి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

Updated Date - Dec 12 , 2025 | 05:30 AM