Movie Shoot: ‘జమిందార్’గా కార్మిక మంత్రి సుభాష్
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:19 AM
ర్మిశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తెరంగేట్రం చేశారు!.
‘ఎవరది?’ చిత్రంతో తెరంగేట్రం.. పెదపాడులో సందడిగా షూటింగ్
పెదపాడు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): కార్మిశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తెరంగేట్రం చేశారు!. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, దానిమాటున ఆడపిల్లలపై జరిగే బలులు, దారుణాలను ప్రధానాంశం గా తీసుకుని తెరకెక్కిస్తున్న ‘ఎవరది’ చిత్రంలో ఆయన జమిందార్ పాత్రలో నటిస్తున్నారు. ఏలూరు జిల్లా పెదపాడు గ్రామంలోని పిన్నమనేని చిన్న రాఘవయ్య అనే ఊరి పెద్ద ఇంటి ఆవరణలో మంగళవారం ఈ చిత్రం షూటింగ్ జరిగింది. మంత్రి సుభాష్ తోపాటు ఇతర నటీనటులతో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. మెగా మూవీ క్రియేషన్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు వట్టి శ్యాం నిర్మాత కాగా, జుత్తిగ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చూడ్డానికి గ్రామస్థులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.