Diamond Discovery: 300 కూలికి వెళితే.. రూ.40 లక్షల వజ్రం దొరికింది
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:23 AM
మూడొందల రూపాయల కూలికి వెళ్లిన ఓ వ్యక్తిని అదృష్టం వజ్రం రూపంలో వరించడంతో రూ.40 లక్షలతో ఇంటికి తిరిగొచ్చాడు. .
కర్నూలు జిల్లాలో తుగ్గలిలో కూలీని వరించిన అదృష్టం
అక్కడికక్కడే 40 లక్షలు చెల్లించిన వజ్రాల వ్యాపారి
తుగ్గలి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మూడొందల రూపాయల కూలికి వెళ్లిన ఓ వ్యక్తిని అదృష్టం వజ్రం రూపంలో వరించడంతో రూ.40 లక్షలతో ఇంటికి తిరిగొచ్చాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో మంగళవారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలికి విలువైన వజ్రం లభ్యమైంది. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో ఆయనకు మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట అదొక సాధారణ రాయి అనుకున్న ఆ కూలీ.. ఆ తర్వాత దాన్ని స్థానిక వజ్రాల వ్యాపారికి చూపించాడు. అది రాయి కాదు విలువైన వజ్రం అని చెప్పిన ఆ వ్యాపారి.. వెంటనే దాన్ని రూ.40 లక్షలకు కొనుగోలు చేశాడు. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామస్థులు, ఎక్కడెక్కడి నుంచో ఈ ప్రాంతానికి వచ్చి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు.