Share News

కార్మిక చట్టాలను కాపాడుకోవాలి

ABN , Publish Date - May 12 , 2025 | 11:57 PM

కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు.

కార్మిక చట్టాలను కాపాడుకోవాలి
మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు

బేతంచెర్ల, మే 12 (ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో పట్టణ జనరల్‌ బాడీ సమావేశం నాయకులు రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహిం చా రు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ లేబర్‌ కోడ్స్‌ను అడ్డుకోకపోతే కార్మికుల భవిష్యత్తు అంఽధకారమే అవుతుందన్నారు. ఇప్పుడు ఉన్న కొద్ది భద్రత కూడా లేకుండా 29 కార్మిక చట్టాలు రద్దు అవుతాయన్నారు. ఇప్పుడున్న 42 కార్మిక చట్టాలు పోరాడి సాధించకున్నవేనన్నారు. అన్నింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. లేబర్‌ కోడ్స్‌పై యావత కార్మిక వర్గం ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మెకు సిద్ధమవుతుందన్నారు. జయప్రదం చేయాలని కోరారు. స మావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ఎల్లయ్య, రామాంజనే యులు, సంజీవరాయుడు, వైబీ వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:57 PM