కార్మిక పోరాట దినం
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:16 PM
చికాగోలో కార్మికుల రక్తతర్పణతో 8 గంటల పని విధానం సాధించి నేటితో 139 ఏళ్లు. 1886 మే 1న 8 గంటల రిక్రియేషన విధానం అమలులోకి రావడంతో నాటి నుంచి ఏటా మే ఒకటో తారీఖున ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’ జరుపుకుంటారు.
కనుమరుగవుతున్న 8 గంటల పని విధానం
ఫ నేడు మే డే
కర్నూలు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): చికాగోలో కార్మికుల రక్తతర్పణతో 8 గంటల పని విధానం సాధించి నేటితో 139 ఏళ్లు. 1886 మే 1న 8 గంటల రిక్రియేషన విధానం అమలులోకి రావడంతో నాటి నుంచి ఏటా మే ఒకటో తారీఖున ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’ జరుపుకుంటారు. అయితే కాలక్రమేణ ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కార్మిక చట్టాలను కాపాడుకోడానికి పోరాడే దీక్షా దినమే మేడే.
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. మోటర్, అనుబంధ రంగాల్లో 35 వేల మంది, భవన నిర్మాణ రంగంలో 2.50 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. మరో లక్ష మందికిపైగా అసంఘటిత కార్మికులు ఉన్నారని కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాలు ఫలాలు అందడం లేదు. గతంలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన ప్రాంతాల్లో పేపర్ మిల్లు, స్విన్నింగ్ (నూలు) మిల్లులు, నూనే మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, సున్నపు పరిశ్రమ, గ్రానైట్, నాపరాతి పరిశ్రమలు.. ఇలా వివిధ పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పని చేసేవారు. పారిశ్రామిక రంగంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పరిశ్రమలు దెబ్బతినిపోయాయి.
ఫ కనుమరుగు అవుతున్న కార్మిక చట్టాలు:
దేశవ్యాప్తంగా కార్మికోద్యమాలు బలహీనపడటంతో 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చేసింది. పలు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించేసింది. ఇలాంటి సందర్భంలో 139వ కార్మిక దినోత్సవం వివిధ కార్మిక సంస్థల ఆధ్వర్యంలో పోరాటాలు జరగాల్సి ఉంది.