Share News

Minister Gummadi Sandhya Rani: కురుపాం విద్యార్థినుల పచ్చకామెర్లకు మరుగుదొడ్లే కారణం

ABN , Publish Date - Oct 15 , 2025 | 05:07 AM

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్ల బారినపడడానికి మరుగుదొడ్లు కారణమని తేలిందని...

 Minister Gummadi Sandhya Rani: కురుపాం విద్యార్థినుల పచ్చకామెర్లకు మరుగుదొడ్లే కారణం

  • మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మహారాణిపేట (విశాఖపట్నం), అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్ల బారినపడడానికి మరుగుదొడ్లు కారణమని తేలిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు వైద్యాధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చిందన్నారు. మంగళవారం ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు. 146 మంది విదార్థినులకు పచ్చకామెర్లు సోకగా, వారిలో 65 మందికి కేజీహెచ్‌లో చికిత్స అందించామన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 05:08 AM