జోగి అరెస్టుపై వైసీపీ రాద్ధాంతం అర్థరహితం
ABN , Publish Date - Nov 03 , 2025 | 07:11 AM
నకిలీ మద్యం కేసులో జోగి రమే్‌షను అరెస్టు చేస్తే దానిపై వైసీపీ రాద్ధాంతం చేయడం అర్థరహితమని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు అన్నారు.
ప్రాణాలు తీసి కులం కార్డు వాడటం సిగ్గుచేటు
శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు విమర్శ
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో జోగి రమే్‌షను అరెస్టు చేస్తే దానిపై వైసీపీ రాద్ధాంతం చేయడం అర్థరహితమని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కల్తీ మద్యం వ్యాపారం చేసి వేల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జోగి రమే్‌షను అరెస్టు చేయడం సరైన చర్యే అన్నారు. కల్తీ మద్యంతో గత ఐదేళ్లలో 30 వేల మంది ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నంత కాలం గుర్తుకు రాని బీసీ కులాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి నీచ రాజకీయాలు చేయాలనుకోవడం దారుణమన్నారు. బీసీ నాయకుడు తోట చంద్రయ్యను నడిరోడ్డుపై పీక కోసి చంపితే ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో 30 మంది బీసీ నేతలను వైసీపీ అరాచక శక్తులు అతి కిరాతకంగా చంపేశాయన్నారు.