Share News

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:39 PM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణాలయంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు
జమ్మలమడుగులో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని పూజలు చేస్తున్న భక్తులు

ప్రొద్దుటూరు టౌన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణాలయంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి వేణుగోపాలస్వామికి పంచామృతాభిషేకం, గోక్షీరాభిషేకం నిర్వహించి నూతన పట్టువస్త్రాలు, వెండి కవచాలు, రంగు రంగుల పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించి కాయాకర్పూరం సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కుకున్నారు. మధ్యాహ్నం భారీగా వచ్చిన భక్తులకు టీటీడీకల్యాణ మండపం ఆవరణలో అన్నప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. రుక్ష్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కృష్ణాలయం యాదవ సంఘం ఆద్వర ్యంలో యాదవ వైద్యులు డాక్టర్‌ నాగార్జున, డాక్టర్‌ సత్యరంగయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సేవా సంఘం అధ్యక్షుడు దాసరి బాలసుబ్బరాయుడుయాదవ్‌, కార్యదర్శి ఆర్‌.వెంకటరమణయాదవ్‌, కోశాధికారి ఆర్‌.వెంకటయ్యయాదవ్‌, ఆలయ మాజీ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్‌యాదవ్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు నాలి క్రిష్ణారెడ్డియాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

అలరించిన మహిళల కోలాట పోటీలు

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురష్కరించుకుని మండల పరిధిలోని నంగనూరు ప్రసన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఉన్న గోసంరక్షణ శాలలో మహిళల కోలాట నృత్య పోటీలు ఉత్సాహంగా సాగడమేకాక భక్తులను అలరించాయి. ఈ పోటీల్లో వాసవీక్లబ్‌ సిరిపురం ఆధ్వర్యంలో వాసవీ కోలాట బృందం ప్రథమ బహుమతి గెలుచుకుంది. వారికి నిర్వాహకులు రూ.12,500 నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, వివేకానందసేవా సమితి అధ్యక్షుడు డాక ్టర్‌ సోమా లక్ష్మినరసయ్య, మల్లికార్జునరావు, వంకదార వీరభద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో వేడుకలు

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్‌ ఆద్వర్యంలో అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూలు మైదానంలో శోభాయమానంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఇస్కాన్‌ కేంద్రంలో శ్రీకృష్ణ బలరాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. హరినామ సంకీర్తన, భక్తిగీతాలాపనలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూలు మైదానంలో కృష్ణ బలరాముల ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. 108 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం హరినామ సంకీర్తన, క్రిష్ణలీలా ప్రవచనం, రాత్రి 7 గంటలకు గౌర హారతి, భగవద్గీత ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుచేలవద నాటకం ఆకట్టుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికి వెన్నలడ్డూను ప్రసాదంగా అందజేశారు. రాత్రి కృష్ణ బలరాముల విగ్రహాలకు మహాశంకాభిషేకం, మహాపుష్పాభిషేకం, మహాహారతి ఇచ్చి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో అనిబిసెంట్‌ మున్సిపల్‌ హైస్కూలు మైదానం కోలాలహలంగా మారింది. సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 40 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఇస్కాన్‌ ప్రతినిధులు మదురేసుదాసు, నిరంజన్‌, గోవిందదాసు, భక్తులు పాల్గొన్నారు.

వేణుగోపాలుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ప్రొద్దుటూరు రూరల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు మండల పరిధిలోని కామనూరులో ఉన్న శ్రీ ప్రసన్న వేణుగోపాలస్వామి ఆలయంలోని వేణుగోపాలస్వామికి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం కృష్ణాష్టమి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు నిర్వాహకులు స్వాగతం పలికారు. తదనంతరం గోశాలలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని గోవులకు ఆహారం తినిపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వ్యాపార సంస్థల సమాఖ్య అధ్యక్షుడు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

బద్వేలులో: మున్సిపాలిటీ పరిఽధిలోని అనంతగిరి క్షేత్రం శ్రీకృష్ణ గీతా మందిరంలో కృష్ణాష్టమి వేడుకలనునివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యానకి పెంచలయ్య, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోవిళ్ల సుబ్బారెడ్డి సభ్యుల ఆధ్వర్యంలో కన్నుల పండుగవగా రుక్మిణి, శ్రీకృష్ణుని కల్యాణోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణం తిలకించారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెక్రటరీ నంద గోపాల్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి సభ్యులు పాల్గొన్నారు.

ముద్దనూరులో:స్థానిక చెన్నకేశవస్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ తోపాటు స్వామి వారికి ఇష్టమైన అటుకులు,బెల్లంతో పాటు ప్రసాదాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ నిర్వాహకులు స్వామి వారికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

కొండాపురంలో:మండలంలో శ్రీకృష్ణాష్టమిని శ నివారం వైభవంగా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వ హిం చారు. చిన్నారులతో శ్రీకృష్ణుడు, గోపికల వేషధా రణతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు

జమ్మలమడుగులో: జమ్మలమడుగులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభోద సేవా సమితి హిందూ జ్ఞానవేదిక త్రైత సిద్ధాంతం జమ్మలమడుగు శాఖ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేనేత విభాగం రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, ఏపీహెచ్‌డీసీ మాజీ ఛైర్‌పర్సన్‌ బడిగించాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి భగవద్గీతను అందించారు. ఈ కార్యక్రమంలో రంగనాయకులు, శిలివేరి శివ పాల్గొన్నారు.

దువ్వూరులో: దువ్వూరులో శనివారం కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక ఆలయంలో శ్రీకృష్ణున్ని అలంకరించి పూజలు నిర్వహించారు. చల్లబసాయిపల్లె వద్దనున్న గోశాల వద్ద బాలికలు కోలాటం నృత్యాలు నిర్వహించారు. కార్యక్రమాలు పలువురిని కనువిందు చేశాయి. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోదరుడు రాఘవరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామి కల్యాణం

రాజుపాలెం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అతి పురాతనమైన అర్కటవేములలో వెలసిన వేణు గోపాలస్వామి ఆలయంలో శనివారం కృష్ణాష్ట్టమి సందర్భంగా స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యక ఆసనంపై ఆశీ నులను చేసి కల్యాణ క్రతువు నిర్వహించారు. అదే విధంగా టంగుటూరులోని మదన గోపాల స్వామి ఆయలంలో ప్రత్యేక పూజలు చేశారు.

బ్రహ్మంగారిమఠంలో:మండలంలోని సిద్దయ్య గారిమఠంలో వెలసియున్న వేణుగోపాలస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. శనివారం మల్లేపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ లక్ష్దిదేవి, . బిమఠం మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బా రెడ్డి, యువ నాయకుడు కాణాల మల్లిఖార్జు న రెడ్డి, బిమఠం సహకార సంఘం ఛైర్మన సాం బశివారెడ్డి, తదితరులు వేణుగోపాలస్వా మిని దర్శించుకున్నారు. సాయంత్రం ఉట్టికొట్టే కార్య క్రమం అలరించియింది. రాత్రి వేణుగోపాల స్వామి గ్రామోత్సవం నిర్వహించారు. సర్పం చ లు మునిరెడ్డి, లక్ష్మిదేవి, రమణయ్య, నారా యణ, నాగరాజు, సిద్దయ్య, సిద్దయ్యమఠం స్వాములు రామక్రిష్ణ, సిద్దయ్య పాల్గొన్నారు.

కలసపాడులో: కలసపాడులోని శ్రీకృష్ణ మంది రంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్ర ద్ధలతో నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా గణపతి పూజ, శ్రీకృష్ణునికి అభిషేకం, భగవద్గీత పారాయణం, అష్టోత్తరం, మహమంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అద్యక్షుడు సుదర్శన, గౌర వాధ్యక్షుడు నాగరాజ, ప్రధాన కార్యదర్శి నారా యణ, వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు సత్యవతమ్మ, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:39 PM