Share News

VVR Krishnam Raju: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:19 AM

అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని. అంటూ సాక్షి చానల్‌ చర్చలో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ...

VVR Krishnam Raju: ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

  • హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని.’’ అంటూ సాక్షి చానల్‌ చర్చలో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ‘‘ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే డిబేట్‌లో ప్రస్తావించాను. నన్ను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. అరెస్ట్‌ చేసి, చిత్రహింసలకు గురిచేస్తారనే ఆందోళన ఉంది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు. దర్యాప్తునకు సహకరిచేందుకు సిద్ధంగా ఉన్నా. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి.’’ అని పిటిషన్‌లో కోరారు.

Updated Date - Jun 11 , 2025 | 05:22 AM