Flood Inflow: శాంతిస్తున్న కృష్ణా, గోదావరి
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:15 AM
నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణా, గోదావరి నదులు శాంతిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.50 అడుగులకు తగ్గడంతో అధికారులు శనివారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణా, గోదావరి నదులు శాంతిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.50 అడుగులకు తగ్గడంతో అధికారులు శనివారం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 9,63,124 క్యూసెక్కుల జలాలను స్పిల్‌వే 48 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నా రు. పులిచింతల నుంచి 3,81,655 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కు 3,92,970 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3,75,125 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, గోదావరి ఉధృతి తగ్గుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించినట్లు వివరించారు.