Share News

AP High Court: కొమ్మినేని బెయిల్‌ షరతుల్లో సవరణ

ABN , Publish Date - Jul 09 , 2025 | 07:09 AM

జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్‌ షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేసేవరకు...

AP High Court: కొమ్మినేని బెయిల్‌ షరతుల్లో సవరణ

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్‌ షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేసేవరకు ప్రతీనెల రెండవ, నాలుగవ శనివారం తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ముందు హాజరుకావాలని ట్రయల్‌ కోర్టు విధించిన షరతులో వెసులుబాటు ఇచ్చింది. తుళ్లూరు స్టేషన్‌లో హాజరయ్యేందుకు వెళ్తే దాడి జరిగే ప్రమాదం ఉందని పిటిషనర్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాడేపల్లి స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ముందు హాజరయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Jul 09 , 2025 | 07:09 AM