Share News

కిలోల లెక్క బాదుడు

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:56 AM

వేసవి రాకముందే పుచ్చకాయల వ్యాపారం జోరందుకుంది. రెండు నెలల ముందు నుంచే మార్కెట్‌లోకి పుచ్చకాయలు వస్తున్నాయి. ఎండలు ముదరటంతో జనం పుచ్చకాయల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. కిలో రూ.30 అని బోర్డులు తగిలించారు. ఐదు కిలోల కాయ కొనాలంటే రూ.150 చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం పుచ్చకాయల ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

కిలోల లెక్క బాదుడు

కొండెక్కిన పుచ్చకాయల ధరలు

కిలో రూ.30 చొప్పున విక్రయాలు

ఐదు చిన్న ముక్కల కప్పు రూ.20

కాయ సైజును బట్టి రూ.50 నుంచి 300 వరకు అమ్మకాలు

తమిళనాడు రాష్ట్రం దిండివనం, రాష్ట్రంలోని నెల్లూరు, గూడూరు, కోట, కృష్ణపట్నం నుంచి దిగుమతి

వేసవి రాకముందే పుచ్చకాయల వ్యాపారం జోరందుకుంది. రెండు నెలల ముందు నుంచే మార్కెట్‌లోకి పుచ్చకాయలు వస్తున్నాయి. ఎండలు ముదరటంతో జనం పుచ్చకాయల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. కిలో రూ.30 అని బోర్డులు తగిలించారు. ఐదు కిలోల కాయ కొనాలంటే రూ.150 చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం పుచ్చకాయల ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఆంధ్రజ్యోతి-విద్యాధరపురం:

మార్కెట్‌లో ప్రస్తుతం పుచ్చకాయలు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇది వరకు వలే కాయ మొత్తం ఖరీదు కాకుండా కిలోల లెక్కన అమ్మటంతో కొనలేని పరిస్థితి నెలకొంది. సహజంగా నీటి కంటెంట్‌ ఎక్కువగా ఉండే పుచ్చకాయ బరువులో కూడా అధికంగానే ఉంటుంది. సుమారుగా ఎంత చిన్న కాయను తీసుకున్నా కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు తూకం తూగుతుంది. దీంతో ఒక చిన్న పుచ్చకాయను రూ.60 నుంచి ఇంకా ఆపైన ధర పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 5 కిలోల బరువు ఉన్న కాయను రూ.150 కొనాలంటే చాలా మంది వెనకకు తగ్గుతున్నారు. గతంలో ఐదు కిలోల కాయను సుమారుగా రూ.60 నుంచి రూ.100 లోపు అమ్మేవారు. ఇప్పుడు కిలోల లెక్కన ఖరీదు కట్టి బాదుతున్నారు. ఏదైనా అడిగితే అన్నీ పెరిగాయ్‌ అంటూ ఒక మాట చెప్పేస్తున్నారు.

పుచ్చకాయలో పోషక విలువలు

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేలరీలు, ఫ్యాట్‌, కొలెస్ర్టాల్‌, సోడియం, కార్బొహైడ్రేట్స్‌, ఫైబర్‌, విటమిన్‌ సి, పొటాషియం, క్యాల్షియం, విటమిన్‌ ఎ తదితరాలు సమపాళ్లలో పుచ్చకాయలో ఉంటాయి. చాలా ప్రాంతాల్లో పుచ్చకాయకు గిరాకీ ఉంది. అన్ని రకాలుగా దేహానికి ఆరోగ్యం ఇవ్వటంతో దీని ప్రాధాన్యం పెరిగింది. బెజవాడకు పుచ్చకాయలు తమిళనాడు రాష్ట్రం దిండివనం నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, చప్పిడి, గూడూరు, కోట, కృష్ణపట్నం, కావలి, తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి కూడా దిగుమతి అవుతున్నాయి. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి.

టన్ను రూ.10 వేల నుంచి 18 వేల వరకు పడుతోంది

పుచ్చకాయ పంట తమిళనాడు రాష్ట్రం దిండివనంలో అధికంగా సాగవుతుంది. అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం. ప్రస్తుతం టన్ను ధర రూ.10 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలుకుతోంది. గతంలో కంటే ప్రస్తుతం ధరలు పెరిగాయి. పుచ్చకాయ సైజును బట్టి రూ.50 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నాం. కేజీ పుచ్చకాయ ధర రూ.30 ఉంది.

- కుమారస్వామి, పుచ్చకాయల వ్యాపారి

Updated Date - Mar 13 , 2025 | 12:56 AM