Village Revenue Officers Association: 19న వీఆర్వోల కీలక సమావేశం
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:37 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం కీలక సమావేశం ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్ష...
విజయవాడ (గాంధీనగర్), డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవిన్యూ అధికారుల సంఘం కీలక సమావేశం ఈ నెల 19న విజయవాడలో నిర్వహించనున్నట్టు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, ఎం.అప్పలనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. వీఆర్‌ఏల డిమాండ్ల సాధనకు ఈ నెల 16న మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద చేపట్టే మహాధర్నాకు మద్దతు ప్రకటించారు.