Secondary Education: ఎస్‌ఎస్‌సీ బోర్డు పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:42 AM
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు(ఎస్ఎస్‌సీ)ను పునర్‌వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు(ఎస్ఎస్‌సీ)ను పునర్‌వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం మంగళగిరిలోని విద్యా భవన్‌లో బోర్డు సన్నాహక సమావేశం జరిగింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, పరీక్షల విభాగం డైరెక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆర్.నరసింహారావు ఇందులో పాల్గొన్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డును పాఠశాల ప్రమాణాల అథారిటీగా మార్చే ప్రతిపాదనపై ఇందులో చర్చించారు. అలాగే ఎన్‌సీవీఈటీ కింద మూల్యాంకనంపైనా చర్చ జరిగింది.