Keerthilal Family: దుర్గమ్మకు కానుకగా విశేష వజ్రాభరణాలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:01 AM
ప్రముఖ స్వర్ణ, వజ్రాభరణాల విక్ర య సంస్థ కీర్తిలాల్ జ్యూవెల్లర్స్ నిర్వాహకులు వజ్రా లు పొదిగిన 531 గ్రాముల బంగారంతో కూడిన సూర్యుడు, చంద్రుడు, ముక్కు పుడక...
531 గ్రాముల ఆభరణాలు అందించిన కీర్తిలాల్ కుటుంబం
విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ స్వర్ణ, వజ్రాభరణాల విక్ర య సంస్థ కీర్తిలాల్ జ్యూవెల్లర్స్ నిర్వాహకులు వజ్రా లు పొదిగిన 531 గ్రాముల బంగారంతో కూడిన సూర్యుడు, చంద్రుడు, ముక్కు పుడక, బులాకీ, బొట్టు, మంగళ సూత్రాలు, గొలుసు బంగారు ఆభరాణాలను కనకదుర్గ అమ్మవారికి అందజేశారు. తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీ రవి, మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ కాళిదాస్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ తదితరులు గురువారం రాత్రి ఇంద్రకీలాద్రిపై ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనానాయక్‌కు అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచన మండపంలో సురాజ్ శాంతకుమార్, తల్లిదండ్రులకు, వారి వెంట వచ్చిన వారికి వేద ఆశీస్సులు అందించారు. అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.