Share News

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:04 AM

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
పట్టణంలోని ఎన్టీఆర్‌ జలాశయంలో గంబూషియా చేపలను వదులుతున్న ఎమ్మెల్యే జయసూర్య

h నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య

h దోమల నివారణ లక్ష్యంగా గంబూషియా చేపల విడుదల

h ఉల్లి రైతులను పంట బీమా ద్వారా హెక్టారుకు

రూ.50 వేలు ఆర్థిక సాయం

నందికొట్కూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్‌ జలాశయంలో, బొల్లవరం, నాగలూటి గ్రామాల్లోని చెరువులు, నీటి కుంటల్లో గంబుషియా చేపలను జిల్లా మలేరియాశాఖ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌తో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు.

ఉల్లి రైతులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం

ధరాగాతం వల్ల తీవ్రంగా నష్టాల పాలవుతున్న ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. ఈ ఖరీఫ్‌ సీజనలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45.278 ఎకరా ల్లో ఉల్లిపంట సాగు చేశారన్నారు. హెక్టారుకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారన్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై రూ.100 కోట్లు పైగా భారం పడుతున్నా... రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వెనుకడుగు వేయడం లేదన్నారు. ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడిస ఆయం ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటి కే మొదటి విడతలో రూ.7 వేలు అందజేసినట్లు ఆయన తెలిపారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కల్పిస్తున్నది కూటమి ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో నందికొట్కూ రు మార్కెట్‌ యార్డు చైర్మన వీరం ప్రసాద్‌రెడ్డి, కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, జాకీర్‌, చిన్నరాజు, టీడీపీ నాయకులు షకీల్‌ అహ్మద్‌, వేణుగోపాల్‌, గిరి, మల్లికార్జునరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బేబి పాల్గొన్నారు.

ఆత్మకూరు పట్టణంలోని నీటికుంటల్లో..

ఆత్మకూరు: దోమల నియంత్రణలో భాగంగా పట్టణంలో నీటికుంటల్లో గంబూసియా చేపలను మలేరియా నియంత్రణ విభాగం సిబ్బంది విడుదల చేశారు. ఈ సందర్భంగా సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేటలో గల కోనేరుతో పాటు పలు ఏరియాల్లో నీటినిల్వలు ఉండే ప్రదేశాల్లో గంబూసియా చేపలను విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బైర్లూటి పీహెచసీ వైద్యులు పవనకుమార్‌, అర్బన హెల్త్‌ సెంటర్‌ వైద్యులు జుబేర్‌, సూపర్‌వైజర్లు మస్తానయ్య, సిబ్బంది భాస్కర్‌, రాజగోపాల్‌, విశ్వనాథ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 12:05 AM