బస్సులను కండిషనలో పెట్టుకోండి
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:59 PM
స్ర్తీ శక్తి పథకం కింద తిప్పే బస్సులను కండిషనలో పెట్టుకోవాలని ఆర్టీసీ కడప జోనల్ చైర్మన పూల నాగరాజు సంబంధిత అధికారులకు సూచించారు.
మహిళల ఫ్రీ బస్సు సంబందించి పలు సూచనలు
ఆర్టీసీ కడప జోనల్ చైర్మన పూల నాగరాజు
నంద్యాల టౌన, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): స్ర్తీ శక్తి పథకం కింద తిప్పే బస్సులను కండిషనలో పెట్టుకోవాలని ఆర్టీసీ కడప జోనల్ చైర్మన పూల నాగరాజు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన నంద్యాల ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేవిధంగా ప్రవర్తించరాదని, వారిని గౌరవించాలన్నారు. ఆర్టీసీ ప్రాంగణంలో వస్తువులను ఎమ్మార్పీ రేట్లకే అమ్మాలని, లేని పక్షంలో వారి లైసెన్స రద్దు చేస్తామన్నారు. గ్యారేజీలోని బస్సులను తనిఖీ చేసివాటి పరిస్థితి అడిగి తెలసుకున్నారు. బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో ఆయన మట్లాడి వారి సమస్యలను తెలసుకుని తగిన రీతిలో పరిష్కరి స్తామని హామీ ఇచ్చారు. ఈనెల 15నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయా ణించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. నంద్యాల డిపోలో 493 బస్సులు ఉండగా వాటిలో 378 బస్సులు పల్లెవెలుగు, డీలక్స్, అల్ర్టా డీలక్స్, సర్వీసులు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్‌ఎం రజీయా సుల్తానా, డీఎం వినయ్‌కుమార్, ఏడీఎం కిషోర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.