Book Release: నేడు బెజవాడలో ‘కథ 2024’ పుస్తకావిష్కరణ
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:13 AM
కథాసాహితి సంకలనాల పరంపరలో 35వది అయిన ‘కథ 2024’ను ఆదివారం విజయవాడలో ఆవిష్కరించనున్నట్టు...
విజయవాడ కల్చరల్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కథాసాహితి సంకలనాల పరంపరలో 35వది అయిన ‘కథ 2024’ను ఆదివారం విజయవాడలో ఆవిష్కరించనున్నట్టు కథాసాహితి సంపాదకుడు వాసిరెడ్డి నవీన్ శనివారం తెలిపారు. సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో సాహిత్య అకాడమి ఈసీ మెంబర్ డాక్టర్ మృణాళిని ‘కథ 2024’ను ఆవిష్కరిస్తారని వివరించారు. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కథాప్రియులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి కళాపీఠం అధ్యక్షుడు పి.లక్ష్మణరావు, ప్రముఖ వైద్యుడు ఏవీ గురవారెడ్డి, కథాసాహితి మరో సంపాదకుడు పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు హాజరు కానున్నట్టు తెలిపారు.