Kasu Mahesh Reddy: ఇప్పుడు కర్రలతో వస్తున్నాం...
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:21 AM
ఇప్పుడు కర్రలతో వస్తున్నాం... రేపు అధికారంలోకి రాగానే గొడ్డళ్లతో వచ్చి వీధుల వెంట పరిగెత్తించి, పరిగెత్తించి తంతాం అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి కూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రేపు గొడ్డళ్లతో వస్తాం: కాసు మహేశ్‌రెడ్డి
మాచవరం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పుడు కర్రలతో వస్తున్నాం... రేపు అధికారంలోకి రాగానే గొడ్డళ్లతో వచ్చి వీధుల వెంట పరిగెత్తించి, పరిగెత్తించి తంతాం’ అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి కూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం పల్నాడు జిల్లా మాచవరంలో ‘బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘2014 నుంచి 2019 వరకు బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తానని చేయకుండానే ముగించారు. ప్రస్తుతం కూడా అలవికాని హామీలు ఇచ్చి తూతూమంత్రంగా చేస్తున్నారు. వైసీపీ నాయకులపై కూటమి నాయకులు లేని పోని అక్రమ కేసులు పెడుతున్నారు’ అని మహేశ్‌రెడ్డి విమర్శించారు.