Liquor Scam: హైకోర్టులో కసిరెడ్డి బెయిల్ పిటిషన్
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:25 AM
మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశానని, మద్యం పాలసీ రూపకల్పనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఇక, మద్యం కుంభకోణంలో రిమాండ్‌లో ఉన్న తనకు కుర్చీ, మంచం సదుపాయాలు కల్పించాలని బూనేటి చాణక్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈనెల ఐదో తేదీన తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయాధికారి పి.భాస్కరరావు వెల్లడించారు.