Share News

ACB Court: జైల్లో వంట కుదరదు

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:58 AM

విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మద్యం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.

ACB Court: జైల్లో వంట కుదరదు

  • రాజ్‌ కసిరెడ్డి పిటిషన్‌ డిస్మిస్‌

విజయవాడ, జూలై 30(ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మద్యం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. జైలులో వంట చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారం వెలువరించారు. తనకు ఇంటి నుంచి భోజనం అనుమతించాలని గతంలో రాజ్‌ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తర్వాత జైలులోనే వంట చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కొట్టేస్తూ తీర్పును ఇచ్చింది.

Updated Date - Jul 31 , 2025 | 04:59 AM