Share News

రాఘవేంద్రుడి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:59 PM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ దర్శించుకున్నారు.

   రాఘవేంద్రుడి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు జ్ఞాపికను అందజేస్తున్న శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు

మంత్రాలయంలో తెలంగాణ, కర్ణాటక మంత్రులు

మంత్రాలయం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ దర్శించుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిట శ్రీహరి, కర్ణాటక చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసేరాజు, రాయచూరు ఎంపీ కుమార్‌ నాయక్‌, మంత్రాలయం, మాన్వీ, మస్కీ, రాయచూరు రూరల్‌, సింధనూరు ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, హంపయ్యనాయక్‌, బసవన్నగౌడు, దద్దాల బసవన్నగౌడు, హంపన్నగౌడు, ఎమ్మెల్సీలు బసన్నగౌడు బడాలీ, వసంతకుమార్‌, బసవరాజుపాటిల్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు సురేష్‌ కోణాపూరు, వెంకటేష్‌ జోషి, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహామూర్తిలు వేదపండితుల మంత్రోచ్చరణాలు, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మఠంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు వివరించారు. వీరికి రాఘవేంద్ర స్వామి మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షింతలు , పరిమళ ప్రసాదం, వెండిగిన్నెలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట రాజా ఎస్‌ అప్రమేయ ఆచార్‌, కృష్ణ కౌసిక్‌, కిరణ్‌ కుమార్‌, సంజీవ్‌ కులకర్ణి, రాయచూరు ఎస్పీ పుట్టమాదయ్య, కలెక్టర్‌ నితీష్‌, కర్నూలు ఏఎస్పీ హుస్సేన పీర, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, రాయచూరు సీఈఓ ఈశ్వర్‌కుమార్‌ పాండు, ఏసీ గజానంద్‌బోలె, రాయచూరు ఏఎస్పీలు హరీష్‌, కుమార్‌స్వామి, శాంతివీర, తహసీల్దారు రమాదేవి, సీఐలు రామాంజులు, మంజునాథ్‌, పద్మనాభతీర్థ ఏసీ గెస్ట్‌హౌస్‌, పోలీ్‌సబందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 22 , 2025 | 10:59 PM