కర్నూలులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:42 PM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓర్వకల్లు విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నారు.
విమానాశ్రయంలో స్వాగతం పలికిన అధికారులు
ఓర్వకల్లు, జూన 23 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఓర్వకల్లు విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నారు. రాయచూరు పర్యటనకు వెళ్లాల్సిన ఆయన బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు చేరుకున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు 11:49 గంటలకు చేరుకుని ఇక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు 12:02 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. రాయచూరులో పర్యటన ముగించుకుని 4:38గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని ఇక్కడి నుంచి 4:58 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. సీఎం సిద్దరామయ్యకు ఇనచార్జి కలెక్టర్ బి.నవ్య, ఏఎస్పీ హుసేన పీరా, డీఎస్పీ బాబు ప్రసాద్, తహసీల్దార్ విద్యాసాగర్‌లు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. తిరుగు ప్రయాణంలో వీడ్కోలు పలికారు. సీఎం వెంట కర్ణాటక రాష్ట్ర మంత్రులు మహాదేవప్ప, కేజే జార్జ్, న్యాయ సలహాదారు రామయ్య, ఎమ్మెల్యేలు అశోక్, కొండన్న ఉన్నారు. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ బందోబస్తు నిర్వహించారు.