Superstar Shivaraj kumar: చాన్స్ వస్తే చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తా
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:44 AM
అవకాశం వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తానని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అన్నారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్
ఇంద్రకీలాద్రి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అవకాశం వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్‌లో నటిస్తానని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అన్నారు. మంచి దర్శకుడు ముందుకు వస్తే ఆ క్యారెక్టర్‌లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం ఆయన కుటుంబసభ్యులతో కలసి విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో నటిస్తున్నానని, విలువలతో కూడిన రాజకీయ నేత జీవిత కథలో నటించడం గర్వంగా ఉందని అన్నారు. రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో మంచి పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు.