Kanipakam Brahmotsavam Begins: కాణిపాకంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:04 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి....
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 28న ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి హంస వాహన సేవతో వాహన సేవలు ఆరంభమవుతాయి. 29న రాత్రి స్వర్ణ నెమలి వాహనం, 30న రాత్రి మూషిక వాహన సేవ, 31న ఉదయం చిన్న శేషవాహన సేవ, రాత్రి పెద్ద శేషవాహన సేవ, సెప్టెంబరు 1న ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహన సేవ, 2 రాత్రి గజ వాహన సేవ, 3 మధ్యాహ్నం రథోత్సవం, 4వ తేదీ రాత్రి తిరుకల్యాణం, అశ్వవాహన సేవ, 5న సాయంత్రం ధ్వజావరోహణం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతరం ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా 6న రాత్రి అధికార నంది వాహన సేవ, 7న రావణబ్రహ్మ వాహన సేవను చంద్ర గ్రహణం కారణంగా ఉదయం నిర్వహిస్తారు. 8వ తేదీ రాత్రి యాళి వాహన సేవ, 9 రాత్రి సూర్యప్రభ వాహన సేవ, 10 రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 11 రాత్రి కల్ప వృక్ష వాహన సేవ, 12 రాత్రి విమానోత్సవం, 13 రాత్రి పుష్పపల్లకి సేవ, 14 రాత్రి కామధేను వాహన సేవ, 15 రాత్రి పూలంగి సేవ, 16వ తేదీ రాత్రి తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.