Share News

Visakhapatnam Zoo: జూలో కంగారు సందడి

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:36 AM

విశాఖ నగరంలోని జంతు ప్రదర్శన శాలలో కంగారు (రెడ్‌ నెక్‌డ్‌ వాలీబా) సందడి చేసింది.

 Visakhapatnam Zoo: జూలో కంగారు సందడి

ఇంటర్నెట్ డెస్క్: విశాఖ నగరంలోని జంతు ప్రదర్శన శాలలో కంగారు (రెడ్‌ నెక్‌డ్‌ వాలీబా) సందడి చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ జంతు ప్రదర్శన శాల నుంచి ఏడాదిన్నర కిందట ఈ కంగారును ఇక్కడికి తీసుకువచ్చారు. ఆరు నెలల కిందట ఇది ఓ పిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్ల ఆరు నెలల వరకు తల్లి కడుపులో ఉన్న సంచిలోనే ఉంటుంది. బుధవారం తల్లితోపాటు పిల్ల కంగారు ఇలా బయటకు కనిపించి, సందర్శకులకు కనువిందు చేసింది.

- ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం

Updated Date - Aug 01 , 2025 | 05:37 AM