Temple Visit: కాల్వబుగ్గలో కంచి పీఠాధిపతి
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:10 AM
కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ ఆలయాన్ని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి శనివారం దర్శించుకున్నారు.
ఓర్వకల్లు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ ఆలయాన్ని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి శనివారం దర్శించుకున్నారు. బుగ్గ రామేశ్వరుడికి రుద్రాభిషేకం, భ్రమరాంబకు కుంకుమార్చన పూజలు చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి రావడంతో ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి దంపతులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విజయేంద్ర సరస్వతి స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులందరూ భక్తి, సేవాభావంతో హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పీఠాధిపతి అనుగ్రహ భాషణం చేశారు.