Kanakameddla Ravindra Kumar: నాలుగు దశాబ్దాల సేవకు గుర్తింపు
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:36 AM
రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ను అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించడంపై ఏపీ ఎన్జీజీవో సంఘం హర్షం వ్యక్తం చేసింది...
కనకమేడలను సత్కరించిన ఏపీ ఎన్జీజీవో నేతలు
విజయవాడ (గాంధీనగర్) డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ను అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించడంపై ఏపీ ఎన్జీజీవో సంఘం హర్షం వ్యక్తం చేసింది. నాలుగు దశాబ్దాల పాటు న్యాయవాదిగా అంకితభావంతో అయన చేసిన సేవకు గుర్తింపుగా ఈ పదవి లభించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. కనకమేడలను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి, అభినందించారు. ఆయనకు పదవి లభించడం దక్షిణ భారతదేశానికి వన్నె తెచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకం దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింప చేస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఆయన సేవలు న్యాయవ్యవస్ధకు ఎంతో ఉపయోగకరమని, రాష్ట్రానికి మరింత ఖ్యాతి తెచ్చేలా ఉంటుందనే భావన రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల, నాయకులు, ఉద్యోగుల్లో ఉందన్నారు.